
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ కు సవాల్ విసరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 16వ రోజు కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో యాత్ర సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలు చూస్తూంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇటీవల కురిసన వర్షాల వల్ల పంట నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు.