https://oktelugu.com/

Kannappa : కన్నప్ప లో ప్రభాస్ లుక్స్ రిలీజ్ చేసేది అప్పుడేనా..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం. ఇక్కడ ఎన్ని సినిమాలు చేశాము అనే దానికంటే ఎన్ని సక్సెస్ లను సాధించాం అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 04:51 PM IST

    Is Prabhas' looks released in Kannappa?

    Follow us on

    Kannappa : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం. ఇక్కడ ఎన్ని సినిమాలు చేశాము అనే దానికంటే ఎన్ని సక్సెస్ లను సాధించాం అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్లే సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. సినిమాలు చేయడంలో లేట్ అయిన పర్లేదు కానీ సక్సెస్ సాధించే కథలనే సినిమాలుగా చేయాలని మన హీరోలు నిశ్చయించుకొని కూర్చున్నారు. అందువల్లే మన హీరోలు సినిమా సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు…

    మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప… ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక దాంతో పాటుగా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కొంతవరకు బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నంది పాత్రను పోషిస్తున్నాడు. ఇక తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా తొందర్లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాలో ఉన్నాడనే ఒక ధైర్యంతోనే మంచు విష్ణు భారీ సహసన్నైతే చేస్తున్నాడు. ఇక 150 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో విష్ణు మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమా విషయంలో మంచు విష్ణు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కనక తేడా కొడితే ఇండస్ట్రీలో ఆయన ఇక మీదట సినిమాలు చేసే అవకాశాలు కూడా లేవు కాబట్టి ఆయన భారీ ప్రణాళికల రూపొందించుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం అది లేకపోతే మాత్రం మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పడానికి మంచు ఫ్యామిలీ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక మంచు విష్ణు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతున్నప్పటికి ఆయనకు చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే ఒకటి లేదనే చెప్పాలి.

    ఢీ సినిమాతో కొంతవరకు మంచి సక్సెస్ ని అందుకున్నప్పటికి భారీ సక్సెస్ అయితే ఒక్కటి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధించాలి.

    అలా అయితేనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఆయన తన క్రేజ్ ని కోల్పోక తప్పదని చాలామంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకమనే చెప్పాలి…