IPL umpires salary : ఐపీఎల్ జోరుగా సాగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో ఐపీఎల్ మొదలవుతుంది. వేసవికాలం మొత్తం ఆటగాళ్లకు దండిగా ఆదాయాన్ని అందిస్తుంది. అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ ఆనందాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. యాజమాన్యాలకు అన్ని విధాలుగా రెవెన్యూను జనరేట్ చేస్తుంది. అందువల్లే ఐపిఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. కాసుల క్రీడ.
ఐపీఎల్ లో బిసిసిఐ కి ప్రముఖ పాత్ర ఉంటుంది. యాజమాన్యాలకు, ఆటగాళ్లకు తర్వాత స్థానం ఉంటుంది. ఇక ప్రకటన కర్తలకు.. ఇతర పాత్రలు పోషించే వారికి అదే స్థాయిలో గౌరవం ఉంటుంది. అందువల్లే ఐపిఎల్ ఈ స్థాయికి ఎదిగింది. 2008లో మొదలైన ఐపీఎల్.. 2026 కు వచ్చే నాటికి ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని తనవైపు చూసుకునేలా చేసింది. ప్రపంచంలో ఫుట్ బాల్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న క్రమంలో.. ఐపీఎల్ వల్ల క్రికెట్ ఆస్థానాన్ని ఆక్రమించే పనిలో పడింది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైనప్పుడు దాని విలువ వేల కోట్లల్లో ఉండేది. ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్లను దాటేసింది.
ఐపీఎల్ ఈ రేంజ్ సాధించడం వెనక అందరికంటే ఎక్కువగా అభిమానుల ఆదరణ ఉంది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా అభిమానులు ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు మైదానాలకు పోటెత్తుతున్నారు. అందువల్లే ఐపిఎల్ ఈ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ లో ఆటగాళ్ల గురించి విపరీతమైన చర్చ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్లు తమ ప్రదర్శన వల్ల అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంటారు. అయితే క్రికెట్ మ్యాచ్ లలో అభిమానులతోపాటు అంపైర్ల పాత్ర కూడా కీలకం. మ్యాచును అంతసేపు ఓపికగా నిలబడి చూడడం ఒక ఎత్తు అయితే.. ప్రతి బంతిని నిష్పక్షపాతంగా పరిశీలించడం మరొక ఎత్తు. కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగానికి గురవుతుంటారు. ఆవేశానికి గురై ఏదైనా చేస్తుంటారు. అటువంటివారిని నియంత్రించడం అంపైర్ల బాధ్యత. ఐపీఎల్ లో ఒక్కో అంపైర్ కు మూడు లక్షల వరకు లభిస్తుంది. ఆన్ ఫీల్డ్ అంపైర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఫోర్త్ అంపైర్ కు మ్యాచ్ కు రెండు లక్షల వరకు ఫీజు లభిస్తుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఒక్కో అంపైర్ కు టెస్ట్ మ్యాచ్ కు 4 లక్షల వరకు ఫీజు లభిస్తుంది. వన్డేలలో 2.5 లక్షలు.. టి20లలో 1.25 లక్షలు వరకు లభిస్తాయి.
డొమెస్టిక్ పోటీలలో గ్రేడ్ ఆధారంగా ఒక అంపైర్ కు 1.2 లక్షల నుంచి 1.6 లక్షల వరకు లభిస్తుంది. ఐపీఎల్ లో మ్యాచ్ అంపైర్లకు ప్రత్యేక హోటల్ రూమ్ లు ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఐపిఎల్ నిర్వాహక కమిటీ వీరికి అందిస్తూ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్లు అత్యంత ఖచ్చితత్వంతో జరుగుతుంటాయి. అందువల్లే ఐపిఎల్ ఈ స్థాయిలో గుర్తింపు పొందింది. అంపైర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు అలానే చూస్తూ ఉంటారు. ప్రతి బంతిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఆటగాళ్లు ఆవేశానికి గురైతే.. వారిని నియంత్రిస్తారు. ఐపీఎల్ నిర్వాహక కమిటీ ప్రస్తుతం అంపైర్లకు బ్లాక్ డ్రెస్ కోడ్ నిర్ణయించింది. బంతి గమనాన్ని నిత్యం పర్యవేక్షించే విధంగా వారికి అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని అందించింది. వారు దానిని తమ తలపై ధరిస్తారు. అందువల్లే నో బాల్, వైడ్ వాటిని అంపైర్లు వెంటనే చెప్పేస్తుంటారు.