IPL Final 2025: నేడు బెంగళూరు, పంజాబ్ మధ్య ఐపీఎల్ ఫైనల మ్యాచ్ జరగనుంది. ఎలాగైనా కప్ గెలిచి తమ అభిమానుల కోరికను నెరవేర్చాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచును ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసేందుకు ఉద్యోగుల డిమాండ్ మేరకు బెంగళూరులోని కొన్ని ఐటీ, వివిధ సంస్థలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. కొన్ని ఎంఎన్సీ లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాయి.