Homeక్రీడలుIPL 2026 Playoffs : ప్లే ఆఫ్ సమరం: ఆ సెంటిమెంట్ ఈసారీ రిపీట్...

IPL 2026 Playoffs : ప్లే ఆఫ్ సమరం: ఆ సెంటిమెంట్ ఈసారీ రిపీట్ అవుతుందా..

IPL 2026 Playoffs : ఇప్పటివరకు ఐపీఎల్ జోరుగా సాగింది. అభిమానులకు వీనులవిందైన క్రికెట్ ఆనందాన్ని అందించింది. ఇకపై ఐపీఎల్ ఆట తీరు మారబోతోంది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్ సమరం షురూ అవుతోంది. ధర్మశాల వేదికగా బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ పోటీ పడపోతున్నాయి. క్వాలిఫైయర్ 1 లో భాగంగా ఈ పోటీ జరుగుతోంది.

రెండు జట్లలో ప్లేయర్లు అద్భుతంగా ఉన్నారు. పోటీ చూడపోతే రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే నేరుగా ఫైనల్ వెళ్లొచ్చు. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది. క్వాలిఫైయర్ లో విజేత జట్టుకు, ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుకు ఫైనల్ పోరు జరుగుతుంది.

ప్లే ఆఫ్ సమరం జరుగుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు ట్రోఫీ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత పరిణామాలు కూడా దీనినే నిరూపించాయి. 2011 నుంచి ప్లే ఆఫ్ విధానం అమల్లో ఉంది. నాటి నుంచి 15 సీజన్లు జరిగాయి. 12 సార్లు క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టు ట్రోఫీ సొంతం చేసుకుంది. 2013, 2016, 2017లో మాత్రం విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మిగతా సందర్బాలలో మాత్రం క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టే ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 2011లో చైన్నై, 2012,2014లో కోల్ కతా, 2015లో ముంబాయి, 2018లో చెన్నై, 2020లో ముంబయి, 2021లో చెన్నై, 2022లో గుజరాత్, 2023లో చెన్నై, 2024లో కోల్కతా, 2025లో బెంగళూరు ట్రోఫీలను అందుకుని సరికొత్త చరిత్ర నెలకొల్పాయి.

2013లో క్వాలిఫైయర్ 1లో చైన్నై ఎదుట ముంబయి నిలబడలేకపోయింది. క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ పై గెలిచిన ముంబయి .. పైనల్ మ్యాచ్ లో చెన్నైమీద గెలిచి ట్రోఫీ అందుకుంది. 2016లో సన్ రైజర్స్ అదరగొట్టింది. నాలుగో స్థానంలో నిలిచిన వార్నర్ సేన ఏకంగా విజేత అయింది. ఎలిమినేటర్ లో కోల్ కతాను ఓడించింది. క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ ను మట్టి కరిపించింది. ఫైనల్ పోరులో బెంగళూరును ఓడించి ట్రోఫీ అందుకుంది.

2017లో క్వాలిఫైయర్ లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలయింది. క్వాలిఫైయర్2లో కోల్ కతాను ఓడించింది. చివరి పోరులో ముంబయి ఒక్క పరుగు తేడా పూణె మీద గెలిచి ట్రోఫీ దక్కించుకుంది ముంబయి ఇండియన్స్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper