
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రాష్ట్రంలోని అందరికీ టీకా ఇవ్వాలనే ఉద్దేశంతో కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను ప్రభుత్వం సేకరించనుంది. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.