
హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిపై ఈటల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈటల రాజేందర్ పోటీ చేసినా.. తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ బిజీగా ఉన్నప్పుడు తాను ప్రచారం చేశానని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా గుర్తు ఒకటే ఉంటుందని జమున స్పస్టం చేశారు.