జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఇంటర్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ స్టూడెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన నిన్న మధ్యాహ్నం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు రోజురోజుకీ పిల్లలపై అత్యాచార ఘటనలు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.