
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాళోజీ కృషి చేశారన్నారు. రాష్ట్రంలో కాళోజీ సిద్ధాంతాలు అమలు చేయాలి. ఆయన ఆశయాల అమలుకు కృషి చేయాలి. సాహిత్య రంగంలో ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివి. అన్యాయాలపై కాళోజీ ఆలోచనతో ఉద్యమించాలి అని రేవంత్ అన్నారు.