
Pawan kalyan28: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మూవీ ఎలా ఉటుందో ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో దర్శకుడు హరీశ్ శంకర్ చూపించాడు. గబ్బర్ సింగ్ లో పవన్ మేనరిజం, కామెడీ, యాక్షన్ టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టి గ్రాండ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కాంబో రిపీట్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రీ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఫస్ట్ లుక్ షేర్ చేసి సినిమా పేరును ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా పవన్-హరీష్ శంకర్ దర్శకత్వంలోని చిత్రానికి పేరును ‘భవదీయుడు భగత్ సింగ్’ గా నామకరణం చేశారు. ఈ పోస్టర్ తోపాటు టైటిల్ ను రివీల్ చేస్తూ ట్వీట్ చేశారు.
బలమైన కథాంశం, అందులో పవన్ కు తగ్గట్టుగా సామాజిక కోణంతో ఈ సినిమా కథను హరీష్ శంకర్ తయారు చేసినట్టు సమాచారం. పవన్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. పవన్ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈసారి కూడా గ్రాండ్ హిట్ అని టైటిల్ తోనే సంబరపడుతున్నారు.
https://twitter.com/harish2you/status/1435819039394197506?s=20