
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం వర్చువల్ సదస్సులో భేటి కాబోతున్నారు నరేంద్ర మోదీ. షెడ్యూల్ ప్రకారం బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ కి రావాల్సి ఉంది. కానీ ఇండియాలో కరోనా ఎక్కువగా ఉండటంతో ఈ పర్యటన రద్దైంది. రేపటి సమావేశంలో రెండు దేశాలకూ సంబంధించిన ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఒకప్పుడు ఇండియాని పరిపాలించిన బ్రిటిషర్లకు కేంద్రమైన బ్రిటన్ తో 2004 నుంచి ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంది.