India vs Australia Semi-Final : మరికొద్ది గంటలు గడిస్తే చాలు.. దేశవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుని పోతారు. టికెట్లు సాధించినవారు మైదానానికి క్యూ లు కడతారు. ఎందుకంటే చాలాకాలం తర్వాత టీమ్ ఇండియా మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లాగా వెళ్ళింది. గ్రూప్ దశలో వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్నప్పటికీ.. టీమిండియా ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో అదరగొట్టింది. న్యూజిలాండ్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించి సెమీ ఫైనల్ దాకా వెళ్ళింది.
వాస్తవానికి ప్రస్తుత వరల్డ్ కప్ లో టీమిండియా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సొంత గడ్డపై ఆడుతుండడం.. దానికి అదృష్టం కూడా తోడు కావడంతో టీమిండియా సెమీఫైనల్ దాకా వెళ్ళింది. వాస్తవానికి టీమ్ ఇండియా గతంలో రెండు సార్లు సెమీఫైనల్ దాకా వెళ్ళింది. అయితే కప్ కలను నెరవేర్చుకోలేదు. టీమిడియా ఈసారి సెమి ఫైనల్ వెళ్ళింది. అయితే కప్ సొంతం చేసుకోవాలంటే బలమైన ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాలి.. ఆస్ట్రేలియా జట్టుతో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం జరగనుంది.
ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ టీమ్ ఇండియాకు అంత ఈజీ కాదు. ఎందుకంటే లీగ్ దశలో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుపై 330 పరుగులు చేసింది. అయినప్పటికీ అ టార్గెట్ రీచ్ కాలేక పోయింది. ఆస్ట్రేలియా జట్టు ఎల్లిస్ ఫెర్రీ, అశ్లిన్ గార్డ్, ఫోబ్ లీచీ ఫీల్డ్, బెట్ మూనీ వంటి వారితో బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనిపిస్తోంది. వీరంతా కూడా సులభంగా మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోగలరు. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హిలి బీభత్సమైన ఫామ్ లో ఉంది. అయితే భారత జట్టుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఈమె అందుబాటులో ఉండకపోవచ్చు. బౌలింగ్లో అలానా కింగ్, అన్న బెల్ వంటి వారితో భారత జట్టుకు ముప్పు తప్పదు. సోఫీ, గార్డ్ నర్ వంటి వారు బంతితో అదరగొట్టగలరు.
సెమి ఫైనల్ మ్యాచ్ కు ముందు ఓపెన్ ప్రతీక గాయంతో టోర్నీకి దూరమైంది. ఇది భారత జట్టుకు ఇబ్బంది కరం. స్మృతి, జెమీమా, హర్లిన్, హర్మన్, దీప్తి, రిచా వంటి వారితో బ్యాటింగ్ విభాగం బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఒత్తిడిలో వీరు ఎంతవరకు ఆకట్టుకుంటారనేది చూడాల్సి ఉంది. క్రాంతి గౌడ్, దీప్తి, రేణుక, శ్రీ చరణి బంతితో గనుక ఆధార కొడితే ఆస్ట్రేలియా జట్టుకు ఇబ్బందులు తప్పవు. ఇక మహిళా క్రికెట్లో ఇప్పటివరకు 12సార్లు వన్డే ప్రపంచ కప్ లు జరిగాయి. ఇందులో భారత జట్టు నాలుగు సార్లు సెమిస్ వెళ్ళింది. 1997లో ఆస్ట్రేలియా చేతిలో, 2005లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2017లో కప్ గెలవడానికి అవకాశం వచ్చినప్పటికీ.. మన అమ్మాయిలు దానిని ఉపయోగించుకోలేకపోయారు. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగులతో ఓడిపోయారు. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా గండాన్ని దాటితే.. ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తో తలపడాల్సి ఉంటుంది.