పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రమే కాదు.. ఆ జట్టు అభిమానులు కూడా అలాగే ఉంటారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులైనట్టు.. పాకిస్తాన్లో ఉన్నవాళ్లంతా కూడా ఒక రకమైన చాందస భావాన్ని కలిగి ఉంటారు. అందువల్లే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
పాకిస్తాన్ దేశంలో అక్కడి ప్రజలకు భద్రత ఉండదు. అందువల్లే అక్కడ ఎప్పుడు ఏ సమయంలో బాంబులు పేలుతాయో ఎవరికీ తెలియదు. అక్కడ ఉగ్రవాదుల శిబిరాలు కొనసాగుతూ ఉంటాయి. ఉగ్రవాదులు ప్రభుత్వంతో అంట కాగుతూ ఉంటారు. ప్రజల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తూ ఉంటుంది. అలా వసూలు చేసిన డబ్బులలో కొంత భాగం ఉగ్రవాదుల కోసం కేటాయిస్తూ ఉంటుంది.
గత ఏడాది ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు భారత దళాలు పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాయి. ఆ దాడులలో ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం అయ్యాయి. అయితే వారంతా కూడా పాకిస్తాన్ ప్రజలని చెప్పిన అక్కడి ప్రభుత్వం.. ఆ శిబిరాల మరమ్మతులకు నిధులు కేటాయించింది. దీనిని బట్టి ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రోత్సాహం కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ దేశం ఇలా ఉంటే.. అక్కడి ప్రజలు కూడా భిన్నంగా ఉంటారు అనుకోవడం మన భ్రమ. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
టీమిండియా అభిమానులను చూస్తే పాకిస్తాన్ అభిమానులకు ఎక్కడా లేని కోపం వస్తుంది. దానిని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాలలో హద్దులు దాటి ప్రవర్తించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా కొలంబోలో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ను చూసేందుకు టీమిండియా అభిమానులు వెళ్లారు.ఈ క్రమంలో పాకిస్థాన్ అభిమానులు. భారత్ అభిమానులు పరస్పరం పరసపడ్డారు. ఈ నేపథ్యంలో భారత అభిమాని సుధీర్ గౌతమ్ ను ఉద్దేశించి పాకిస్థాన్ అభిమానులు బికారి (బిచ్చగాడు) అని విమర్శించారు .
సుధీర్ గౌతమ్ టీమిండియా కు వీరాభిమాని. టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ ను సుధీర్ వీక్షిస్తాడు. అయితే అతడి ఆర్థిక నేపథ్యం అంతంత మాత్రమే కావడంతో సుధీర్ కు బిసిసిఐ టికెట్లు ఉచితంగా ఇస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ అభిమానులు అతడిని ఉద్దేశించి బికారి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. పాకిస్తాన్ అభిమానులను ఉద్దేశించి టీమిండియా అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. బిచ్చగాళ్లు బికారి అనే పదాన్ని వాడకూడదని ఎద్దేవా చేస్తున్నారు.
Fight between India-Pakistan fans:
Chacha Pakistan, a Pakistan cricket team's super fan had called Indian cricket team's super fan Sudhir Gautam a 'bhikhari' (beggar)
…because the latter gets match tickets and other expenses covered by the BCCI. pic.twitter.com/3ItUi8bBWu
— Wren (@vyomanaut02) February 15, 2026