
రెండో రోజు ఆట ప్రారంభం కాగానే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట తొలి ఓవర్లోనే టీమ్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. శతక వీరుడు కేఎల్ రాహుల్ (129) ఔటయ్యాడు. రెండో రోజు రెండో బంతికే అతడు ఔటయ్యాడు. రాబిన్సన్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి డామ్ సిబ్లీ చేతికి చిక్కాడు. వెంటనే టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. జిమ్మీ అండర్స్ వేసిన 91.1 బందికి అజింక్య రహాన్ (1) ఔటయ్యాడు. రూట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.