India U19 World Cup : అనుకున్నట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద భారత్ గెలిచింది. 311 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. తద్వారా ఫైనల్ వెళ్లిపోయింది. ఫైనల్ లు ఇంగ్లాండు జట్టుతో అమీ తుమీ తేల్చుకొనుంది.
ఆఫ్గనిస్తాన్ జట్టుపై భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా విజయం సాధించడం.. యువభారత్ సత్తాను తేట తెల్లం చేస్తోంది. ఈ క్రమంలోనే యువభారత్ అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున ఇది అత్యంత విజయవంతమైన పరుగుల చేదన. 2002 ఇంగ్లాండ్ జట్టుపై టౌన్ టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 304 పరుగుల లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తద్వారా తన పేరు మీద ఉన్న రికార్డును తనే బద్దలు కొట్టుకుంది.
ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున వైభవ్ సూర్య వంశీ 15 సిక్సర్లు కొట్టాడు. తద్వారా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో బ్రేవిస్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2022లో అతను 18 సిక్సర్లు కొట్టాడు. 2016లో జాక్ బర్న్ హోమ్ 15 సిక్సర్లు కొట్టాడు. 2008లో మైకేల్ హిల్ 14 సిక్సర్లు కొట్టాడు. 2014లో నికోలస్ పూరన్ 14 సిక్సర్లు కొట్టాడు.
అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లలో మొదటి 15 ఎడిషన్లలో ఆరు సెంచరీలు నమోదు అయితే.. 2026 లో ఏకంగా ఐదు సెంచరీలు నమోదు అవ్వడం విశేషం.
అండర్ నాటిక వరల్డ్ కప్ లో ఇండియా తరఫున నాకౌట్ మ్యాచ్లలో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పూజార మొదటి స్థానంలో ఉన్నాడు. 2006లో కొలంబో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పూజార 129* పరుగులు చేశాడు
2026 లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో జార్జ్ 115 పరుగులు చేశాడు.
2012 లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఉన్ముక్త్ 111* పరుగులు చేశాడు.
2016లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నమీబియా పై రిషబ్ పంత్ 111 పరుగులు చేశాడు.
2022లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో యష్ దుల్ 110 పరుగులు చేశాడు.
2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రికీ 108 పరుగులు చేశాడు.
2020లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ 105* పరుగులు చేశాడు.
2018లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గిల్ 102* పరుగులు చేశాడు.
2018లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మంజోత్ 101* పరుగులు చేశాడు.
అండర్ 19 వరల్డ్ కప్ లో రెండు ఇన్నింగ్స్ లలో మొదటి మూడు వికెట్లకు 50 కంటే ఎక్కువ భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
2014లో స్కాట్లాండ్ జట్టుపై శ్రీలంక 138 (టార్గెట్ 270) తర్వాత, అండర్ 19 వరల్డ్ కప్ లో 250+ పరుగుల చేదనకు ఇంకా 53 బంతులు మిగిలి ఉండడం ఇదే తొలిసారి.
అండర్ 19 వరల్డ్ కప్ లో చటోగ్రామ్ వేదికగా 2004లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్ పోటీపడ్డాయి. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా 340/5, ఐర్లాండ్ 291/9 పరుగులు చేశాయి. తద్వారా రెండు జట్లు 631 పరుగులు చేశాయి. ఇప్పుడు ఆ రికార్డుకు దగ్గరగా భారత్, ఆఫ్గనిస్తాన్ వచ్చాయి.
అండర్ 19 వరల్డ్ కప్ లో హైయెస్ట్ రన్స్ టార్గెట్ విజయవంతంగా చేదించిన జాబితాలో టీమ్ ఇండియా మొదటి స్థానంలోకి వచ్చేసింది. ఈ జాబితాలో రెండవ స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతోంది. 2006లో ఐర్లాండ్ జట్టు విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది.
2022లో బంగ్లాదేశ్ విధించిన 294 పరుగుల విజయ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా విజయవంతంగా ఫినిష్ చేసింది.
2010లో శ్రీలంక విధించిన 292 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ విజయవంతంగా ఫినిష్ చేసింది.
2018లో ఐర్లాండ్ విధించిన 279 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ విజయవంతంగా పూర్తి చేసింది.