https://oktelugu.com/

CM Chandrababu : పవర్‌ఫుల్‌ పొలిటీషియన్స్‌ వీరే.. దేశంలో మోదీ, ముఖ్యమంత్రుల్లో మన ‘బాబే’ తోపు అంతే.. ఫుల్‌ లిస్ట్‌ ఇదీ

ప్రపంచంలో రాజకీయాలు చాలా కాలంగా మగవాళ్లకు కంచుకోటగా ఉన్నాయి. తక్కువ మంది మాత్రమే మహిళలు రాజకీయల్లో రాణిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఎక్కువ కాలం, శక్తివంతంగా ఉండడం అంత ఈజీ కాదు. పనితీరు, పాలన తీరును బట్టి నేత బలవంతులా, బలహీనులా అనేది నిర్ధారణం అవుతుంది.

Written By: Raj Shekar, Updated On : November 13, 2024 11:24 am

powerful politicians

Follow us on

CM Chandrababu :  ప్రపంచ రాజకీయాలు వేరు.. భరత రాజకీయాలు వేరు. ప్రపంచంలో మతం ప్రాతిపదికన రాజకీయాలు ఉన్నాయి. భారత దేశంలో మాత్రం కులం, మతం, ప్రాంతీయత ఆధారంగా రాజకీయాలు ఉన్నాయి. ఈ మూడే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీల నేతలు కులం పోవాలని అంటారు. అందరం ఒక్కటే అని స్పీచ్‌లు ఇస్తారు. కానీ, ఓట్ల సమయంలో మాత్రం కులం, మతం ప్రాతిపదికనే ఓట్లు వేస్తున్నారు. అయితే రాజకీయాలు ఎలా ఉన్నా.. ప్రభావింత చేయగలిగే శక్తి కొందరికి ఉంటుంది. అలాంటివారు ఏటా మారుతుంటారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారత దేశంలో పది మంది శక్తివంతమైన పొలిటీషియన్స్‌ జాబితాను ఇండియా టుడే విడుదల చేసింది.

ప్రజాదరణ ఆధారంగా..
ప్రజాదరణ ఆధారంగా ఇండియా టుడే ఏటా రాజకీయ నేతలకు ర్యాంకులు ఇస్తోంది. మహిళా నేతలకు కూడా ప్రత్యేకంగా ర్యాంకులు ఇస్తోంది. వ్యాపారులకు కూడా ఒక జాబితా ఇస్తోంది. సినిమా వాళ్లకు మరో సంస్థ ర్యాంకులు ఇస్తోంది. తాజాగా ఇండియా టుడే శక్తివంతమైన పది మంది పేర్లతో జాబితా ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించిన జాబితా కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ పది మందిలో తెలుగు రాష్ట్రాల నేత కూడా ఉండడం గమనార్హం.

పది మంది వీరే..
దేశంలో ప్రస్తుతం శక్తివంతమైన పొలిటీషియన్ల జాబితాలో కొత్తవారికి చోటు దక్కింది. ఎన్నికల తర్వాత ర్యాంకులు మారిపోయాయి. తాజా జాబితాలో ప్రధాని నరేద్రమోది మొదటి ర్యాంకులో ఉన్నారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మూడో స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నాలుగో ర్యాంకులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఇక ఐదో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆరో స్థానంలో బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎనిమిదో స్థానంలో తమిళానాడు సీఎం స్టాలిన్, తొమ్మిదో స్థానంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పదో స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఉన్నారు.

సీఎంలలో చంద్రబాబు నంబర్‌ వన్‌
దేశంలోని శక్తివంత మైన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత నిర్వహించిన సర్వేలో పది మంది శక్తివంతమైన నేతల్లో›్ల బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ సీఎంలతోపాటు ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానం దక్కింది. సీఎంలలో చంద్రబాబు నాయుడు మొదటిస్థానంలో నిలిచారు.

తెలంగాణ సీఎంకు దక్కని చోటు..
ఇండియా టుడే పవర్‌ ఫుల్‌ పొలిటీషియన్‌ తాజా జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి స్థానం దక్కలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 11 నెలలు గడిచింది. బలమైన బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, శక్తివంతమైన నేతగా గుర్తింపు దక్కలేదు. మూసీ శుద్ధీకరణ పేరుతో ఇళ్లు కూల్చడం, హైడ్రా ప్రభావంతో ర్యాంకుల్లో రేవంత్‌రెడ్డి వెనుకబడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.