
టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. నీల్ వాగ్నర్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ (28) ఔటయ్యాడు. 24.3 ఓవర్ కు వికెట్ల వెనుక కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 63 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు పుజారా ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. 25 ఓవర్లకు భారత్ 63/2 తో నిలిచింది.