
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్-రాహుల్ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఇంగ్లిష్ బౌలర్లు చేసిన ప్రయత్రాలు ఫలించాయి. సెంచరీకి చేరువగా వెళ్తున్న రోహిత్ శర్మను జేమ్స్ అండర్సన్ తన పదో ఓవర్ లో బౌల్డ్ చేశాడు. 145 బంతులు ఆడిన రోహిత్ 11 ఫోర్లు, సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. రోహిత్ అవుత్ తో 126 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.