
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు క్రికెట్ లో భారతే బెస్ట్ టీం అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అన్నాడు. గత ఏడాది కాలంగా టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. ఎన్నో మరపురాని విజయాలు సాధించింది. ప్రస్తుతం టెస్టుల్లో భారతే అత్యుత్తమ జట్టు. అందుకు టీమిండియాకు వందశాతం అర్హత ఉంది. కంగ్రాట్స్ అని పేర్కొన్నాడు.