spot_img
Homeజాతీయ వార్తలుdelimitation bill India : 16న పార్లమెంట్లో పునర్విభజన బిల్లు.. పెరిగే ఎంపీ స్థానాలు ఇవే..

delimitation bill India : 16న పార్లమెంట్లో పునర్విభజన బిల్లు.. పెరిగే ఎంపీ స్థానాలు ఇవే..

delimitation bill India : దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాతినిధ్యం తగ్గిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈనెల 16న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు.. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు బిల్లుల గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు సమాచారం అందించింది. ఆ లేఖలను కూడా వారికి పంపించింది..

బిల్లు ప్రతిపాదనల ప్రకారం

నియోజకవర్గాల విభజనకు సంబంధించిన అంశం గత కొద్ది కాలంగా చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో బిల్లు ప్రతిపాదనల ప్రకారం ఆయా రాష్ట్రాలలో 815 వరకు పార్లమెంటు స్థానాలను పెంచే అవకాశం కనిపిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాలలో 35 వరకు స్థానాలు పెరుగుతాయని సమాచారం. దీంతో దేశం మొత్తం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 850 వరకు చేరుతాయని వినికిడి. పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్లు సభ్యుల ఆమోదం పొందిన తర్వాత.. కేంద్ర వెంటనే డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత సీట్ల పెంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పెరిగిన సీట్లకు 2029లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు తెలుస్తోంది.

ఆ రిజర్వేషన్లు కూడా

సీట్ల పెంపు లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టి రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. జనాభా లెక్కింపు తర్వాత.. దాని ద్వారా వచ్చిన లెక్కల ప్రకారం సీట్ల పెంపు నకు అనుమతి లభిస్తే.. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.. దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే తీరైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలలో సగటున పార్లమెంట్, శాసనసభ సీట్లను 50% వరకు పెంచాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల అన్ని రాష్ట్రాలకు.. ప్రస్తుతం లభిస్తున్న రాజకీయ ప్రాతినిధ్యం ఎప్పటి మాదిరిగానే కొనసాగుతుందని తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఇతర పార్టీల కీలక నాయకులు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడుతున్నారు. స్టాలిన్ అయితే తన ఎన్నికల్లో ప్రచారస్త్రంగా డీలిమిటేషన్ ను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ డీలిమిటేషన్ ప్రతులను పంపిణీ చేయడం విశేషం. ఎన్నికలకు ముందు వీటిని పంపిణీ చేయడం వల్ల ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు పరిష్కార మార్గం లభించినట్లు అయిందని బిజెపి నేతలు అంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారానికి చేపడుతుందని వారు భావిస్తున్నారు. 16 తారీఖున పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular