ఆసియా కప్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపు ద్వారా పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ విషయంలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. బౌలింగ్లో భారత్ ముందుగా అదరగొట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్లో విరగదీసింది. 9 వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం చిరకాల అభ్యర్థి పాకిస్తాన్ జట్టుతో తేల్చుకోవడానికి సిద్ధమైంది. తొలి మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియాలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది.
తొలి మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు 14.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. కేవలం 57 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 58 పరుగుల టార్గెట్ ను భారత్ కేవలం 4.3 ఓవర్లలో ఫినిష్ చేసింది. అభిషేక్ శర్మ 30, గిల్ 20 సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. తద్వారా టీమిండియా కు చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారు. ఈ విజయం ద్వారా టీమిండియా అనితర సాధ్యమైన ఉత్సాహాన్ని నింపుకుంది. ఇదే ఊపుతో తదుపరి మ్యాచ్లు కూడా గెలిచి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిత్వాన్ని ఆకాశం అంచులో నిలబెట్టింది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా అతని నాయకత్వ పటిమ ప్రశంసలను దక్కించుకున్నది.
ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 13 ఓవర్లో ఈ ఘటన జరిగింది. అ ఓవర్ ను శివం దుబే వేశాడు. అతడు వేసిన మూడో బంతిని సిద్ధికి ముందుకు వచ్చాడు. బాల్ మిస్ అయి కీపర్ సంజు చేతిలో పడింది. అతడు రెప్పపాటు వ్యవధిలోనే బంతితో స్టంప్ లను నేల కూల్చాడు. ఆ సమయంలో సిద్ధికి క్రీజు అవతల ఉన్నట్టు కనిపించింది. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. రిప్లై లో టీవీ ఎంపైర్ అవుట్ అని ప్రకటించాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో సిద్ధికి నాట్ అవుట్ గా నిలిచాడు. అయితే అంపైర్లు కూడా ఒక విషయాన్ని విస్మరించారు. 13 ఓవర్లో శివం దుబే బంతివేస్తున్న సమయంలో.. అతడి ప్యాంట్ కు ఉన్న టవల్ ఒక్కసారిగా కింద పడిపోయింది.. బౌలింగ్ వేస్తున్నప్పుడు అలా జరిగితే ఆ బంతిని డెడ్ బాల్ అని ప్రకటిస్తారు. ఆ బంతికి ఆరు పరుగులు వచ్చినప్పటికీ.. లేదా అవుట్ అయినప్పటికీ లెక్కలోకి తీసుకోరు. ఆ సమయంలో బంతిని మళ్లీ వేయాల్సిందే. అయితే ఈ విషయాన్ని ఎంపైర్లు పట్టించుకోలేదు. స్టంట్ అవుట్ అని నిర్ణయించారు. అయితే ఈ నిబంధన గురించి తెలిసిన సూర్య కుమార్ యాదవ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు. తర్వాత అంపైర్లకు ఏదో చెప్పాడు. దీంతో వారు కూడా నాట్ అవుట్ అని ప్రకటించారు. సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు రాముడు లాగా ఉందని.. అతడు ధర్మాన్ని తప్పలేదని.. నీతిని వదిలిపెట్టలేదని.. న్యాయాన్ని దూరం చేసుకోలేదని.. ధర్మ ప్రభువుగా నిలిచాడని.. సూర్య కుమార్ యాదవ్ కూడా అలానే వ్యవహరించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.