IND vs AUS : ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా టీమిండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.. ఇక ఆదివారం ఓవల్ వేదికగా మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ లో విఫలమైనప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టింది. టాస్ గెలిచిన టీమిండియా సారథి సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి 6 వికెట్ల నష్టానికి 186 రన్స్ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో హెడ్(6), మార్ష్(11), ఇంగ్లిస్(1) విఫలమైనప్పటికీ.. డేవిడ్ (74), స్టోయినిస్(64), షార్ట్(26) దుమ్ము రేపడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. అర్ష్ దీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు సాధించారు.
187 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఎప్పటి మాదిరిగానే ఓపెనర్ అభిషేక్ శర్మ (25) బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. గిల్(15), సూర్య కుమార్ యాదవ్(24), తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్(17) కీలకమైన దశలో అవుట్ అయ్యారు. ఈ దశలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ ( 49*) ప్రారంభం నుంచి అదరగొట్టాడు. బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించాడు. తిలక్ వర్మతో కలిసి 34 పరుగులు, జితేష్ శర్మతో కలిసి 43* పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి టీమ్ ఇండియా విషయంలో వాషింగ్టన్ సుందర్ ముఖ్యపాత్ర పోషించాడు. జితేష్ శర్మ కూడా (22*) పరుగులు చేసి వారేవా అనిపించాడు. ఆస్ట్రేలియా జట్టులో 3 వికెట్లు పడగొట్టాడు. కీలక దశలో వికెట్లు పడిపోయినప్పటికీ వాషింగ్టన్ సుందర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడటంతో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది..
వాస్తవానికి ప్రారంభం నుంచి టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. గిల్ మినహా మిగతా ప్లేయర్లు మొత్తం అదరగొట్టారు. తమస్థాయిలో బ్యాటింగ్ చేసి సత్తా చూపించారు. అందువల్లే పరుగుల వరద సాధ్యమైంది. కీలకమైన దశలో వికెట్లు కోల్పోయినప్పటికీ అప్పటికే టీమిండియా విజయానికి దగ్గరగా ఉండడంతో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్ మినహా మిగతా వారంతా విఫలం కావడంతో టీమిండియాకు చేజ్ ఈజీ అయిపోయింది. ఈ మ్యాచ్లో గిల్ విఫలమైన నేపథ్యంలో.. అతడిని రిజర్వు బెంచ్ కు పరిమితం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విజయం ద్వారా సిరీస్ 1-1 తో ఈక్వల్ అయిపోయింది.. ఆస్ట్రేలియా విధించిన 187 రన్స్ టార్గెట్ ను టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆస్ట్రేలియా జట్టు మీద ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును దక్కించుకుంది.. సూపర్ ఇన్నింగ్స్ ద్వారా వాషింగ్టన్ సుందర్ ఓవర్ నైట్ హీరో అయిపోయాడు.