
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,856 పరీక్షలు నిర్వహించగా 2,287 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,68,462 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 18 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 19,34,048కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,019 యాక్టివ్ కేసులున్నాయి.