
కరోనా టీకాల రెండు డోసుల మధ్య వ్యవధి పెంచే విషయమై అధ్యయనం చేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే దాని సామర్థ్యం కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మద్య ఎంత వ్యవధి ఉండాలనే విషయమై జరిపిన పరిశోదనను లాన్సెట్ జర్నల్ ఈ ఏడాది మార్చిలో ప్రచురించింది. దాని ప్రకారం రెండు డోసుల మధ్య వ్యవధి ఆరు వారాలు ఉంటే టీకా సామర్థ్యం 55.1 శాతంగా ఉంది. 12 వారాలకుపెంచితే సామర్థ్యం 81.3 శాతం పెరిగింది.