https://oktelugu.com/

Children : మీ పిల్లలు ఇలా ఉన్నారా? అయితే వారి లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే..

పిల్లలు బాగుండాలంటే వారిని చెడు అలవాట్లకు దూరం చేయాలి. కానీ కొన్ని చెడు అలవాట్లు వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కొన్ని సార్లు వారి కెరీర్‌తో పాటు మీ కలల్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది. అందుకే పిల్లల్ని కొన్ని చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడం చాలా అవసరం. మరి అవేంటో ఓ సారి చూసేద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 11, 2024 / 02:12 AM IST

    Children

    Follow us on

    Children : పిల్లలను పెంచడం పెను సవాలు. మారిన జీవన శైలి, పని ఒత్తిడి వల్ల పిల్లల్ని పెంచడం, వారికి గైడెన్స్ ఇవ్వడం చాలా కష్టమే. దీంతో పిల్లల మీద అశ్రద్ధ చూపుతున్నారు తల్లిదండ్రులు. కానీ పిల్లల్ని అర్థం చేసుకోవడం, అదే విధంగా వారిని పెంచడం చాలా ముఖ్యం. పిల్లలు బాగుండాలంటే వారిని చెడు అలవాట్లకు దూరం చేయాలి. కానీ కొన్ని చెడు అలవాట్లు వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కొన్ని సార్లు వారి కెరీర్‌తో పాటు మీ కలల్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది. అందుకే పిల్లల్ని కొన్ని చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడం చాలా అవసరం. మరి అవేంటో ఓ సారి చూసేద్దాం.

    కొందరు పిల్లలు ఏ పని చెప్పినా సరే వాయిదా వేయడం అలవాటు ఉంటుంది. లేదంటే ఆలస్యం చేస్తుంటారు. ఈ అలవాటు అసలు మంచిది కాదు. చదువును ఆలస్యం చేయడం వల్ల వారి భవిష్యత్తు ఊహించలేని ప్రమాదంలో పడుతుంది. చేయాల్సిన హోమ్ వర్క్ రేపు చేస్తారు.. రేపు చదువుతాను అంటే మాత్రం మీరు ఊరుకోవద్దు. మీ పిల్లలు ఇలా చేస్తుంటే వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. వారి కోసం స్థిరమైన రోజూ వారీ టైమ్ టేబుల్‌ని నిర్ణయించి ఆ సమయంలో వర్క్ చేయాల్సిందే అని చెప్పండి. సమయానికి పనుల్ని పూర్తి చేయడం అలవాటు చేయించండి.

    మరి కొందరి పిల్లలకు టైమ్ మేనేజ్‌మెంట్ తెలియదు. ఉన్నా పాటించరు. సమయానికి నిద్ర, ఆహారం, చదవడం వంటివి అసలు చేయరు. స్కూల్‌కి కూడా చాలా ఆలస్యంగా వెళ్తుంటారు. ఇలాంటి అలవాట్లు మీ పిల్లలకు ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. టైమ్ మేనేజ్‌మెంట్ లేకపోతే వాళ్లు కెరీర్‌లో లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టం. ప్రతి పనిని సమయానికి చేయాలని నేర్పించాలి. రోజూ ఒకే టైమ్‌కి నిద్రపోయేలా, తినేలా, చదివేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. స్కూల్‌కి కూడా ఆలస్యంగా వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి. ఈ చిన్న పనుల వల్ల పిల్లల్లో టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతుంది అంటున్నారు నిపుణులు.

    చిన్న పొరపాట్లే జీవితాన్ని నాశనం చేస్తాయి. పిల్లలు అజాగ్రత్త, నిర్లక్ష్యం వంటి లక్షణాలతో ఉంటే కూడా జాగ్రత్త. వస్తువులు పొగొట్టడం, పగలగొట్టడం వంటివి రిపీట్ గా చేస్తారు. మీ పిల్లలు ఇలా ఉంటే ప్రతి పనిని జాగ్రత్తగా చేసే అలవాటును నేర్పించాలి. ఏదైనా వస్తువును మిస్ చేసినా, పగలగొట్టినా తిరిగి వారి పాకెట్ మనీ నుంచే కొనమని చెప్పాలి. క్లీన్ చేయడం కూడా వారి బాధ్యతనే.

    ఏకాగ్రత లేకుండా పరధ్యానంలో ఉంటారు కొందరు పిల్లలు. మనం ఒకటి చెబుతుంటే వాళ్లు ఏదో ధ్యాసలో ఉంటారు కానీ మీరు చెప్పేది వినరు. స్కూల్ లో కూడా సేమ్. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఇలా ఉంటే పిల్లలకు యోగా, ధ్యానం అలవాటు చేయడం చాలా ముఖ్యం. వారి దృష్టి మరల్చాలి. ప్రశాంత వాతావరణం మీ ఇంట్లో ఉండాలి. ఫోన్లు, సోషల్ మీడియా జోలికి పోనివ్వద్దు.

    రాత్రి వరకు మేల్కొని ఉండటం, సరిగ్గా తినకపోవడం, క్రమరహిత దినచర్య ఉండే పిల్లలకు కూడా చాలా మందే ఉంటారు. దీని వల్ల ఒక నిర్దిష్ట లైఫ్ స్టైల్ ఉండదు. అందుకే తల్లిదండ్రులుగా వారి దినచర్యపై ఫోకస్ పెట్టడం మీకు చాలా ముఖ్యం. రోజూ త్వరగా నిద్రపోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే మేల్కొనేలా ప్లాన్ చేసి ఫుడ్ విషయంలో కూడా అదే కేర్ తీసుకోండి.

    తప్పులు అంగీకరించు కొందరు. చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకే ఇలాంటి పిల్లలకు వారి తప్పుల నుంచి నేర్చుకోవాలి అని మీరే అర్థం అయ్యేలా చెప్పాలి. చిన్న విమర్శలను కూడా పట్టించుకోవద్దని నేర్పించండి.