https://oktelugu.com/

Health Tips : ఈ ఫుడ్ తింటున్నారా? అయితే కీళ్ల నొప్పులతో బాధ పడతారు..

కొన్ని రకాల ఆహారాలు ఎంత మంచి చేస్తాయో మరికొన్ని అంతే కీడు కూడా చేస్తాయి. వాటిని ఎక్కువ తీసుకుంటే కీళ్ల నొప్పులు వస్తాయట. మరి ఈ సమస్య వచ్చిందంటే చాలు ఏ పనీ సరిగా చేయలేం. శరీరం మాట వినదు. మరి అంతలా ఇబ్బంది పెట్టే ఆ ఆహారాలు ఏంటి అనుకుంటున్నారా?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 20, 2024 / 11:18 PM IST

    Joint pain

    Follow us on

    Health Tips :  బిజీ లైఫ్, మారిన జీవన శైలి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. వద్దన్నా అనారోగ్య సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చిన్న వయసు నుంచే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇక వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే సమస్యల గురించి వివరించాల్సిన అవసరం లేదు. గంటలు గంటలు కంప్యూటర్స్ ముందు కూర్చొని పని చేయాల్సిన రోజులు పెరిగాయి. దీంతో శారీరక శ్రమ ఉండటం లేదు. ఇక వ్యాయామాలకు సమయం ఉండటం లేదు కాబట్టి జీరో శారీరక శ్రమ, ఫుల్ మైండ్ టెన్షన్ మాదిరి తయారైంది. ఈ క్రమంలోనే చాలా మందికి యంగ్ ఏజ్‌లోనే కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలు సరిపోవు అన్నట్టుగా తినే ఆహారాల్లో కూడా పోషకాలు ఉండేలా చూసుకోవడం లేదు ప్రజలు. మరి నెగ్లెట్ కి మూల్యం చెల్లించుకోవాల్సిందే కాబట్టి అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత మంచి చేస్తాయో మరికొన్ని అంతే కీడు కూడా చేస్తాయి. వాటిని ఎక్కువ తీసుకుంటే కీళ్ల నొప్పులు వస్తాయట. మరి ఈ సమస్య వచ్చిందంటే చాలు ఏ పనీ సరిగా చేయలేం. శరీరం మాట వినదు. మరి అంతలా ఇబ్బంది పెట్టే ఆ ఆహారాలు ఏంటి అనుకుంటున్నారా?

    రెడ్ మీట్: మాంసం లేనిదే ముద్ద దిగదు బాస్ అంటూ తెగ లాగించేస్తున్నారు. ఇక అందులో రెడ్ మీట్ కు మరింత అలవాటు పడ్డారు. ఈ రెడ్ మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. ఈ రెడ్ మీట్ లో ప్యూరిన్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీన్ని అధికంగా తీసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఇబ్బంది పెడుతాయి. అందుకే రెడ్ మీట్‌కి వీలైనంత దూరంగా ఉండటం బెటర్.

    సోయా ఫుడ్స్:
    సోయా ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి అని చెబుతుంటారు నిపుణులు. ఇందులో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అతి సర్వత్రా వర్జయేత్. సో ఆరోగ్యానికి మంచిదని సోయా ఎక్కువగా తీసుకుంటే మాత్రం కీళ్ల నొప్పులతో బాధ పడాల్సిందే. సో మీరు తినే ఆహారం ఏంటి.. మీ శరీరంలో ఎలాంటి మార్పులు రాబోతాయి అనే వివరాలు తెలుసుకొని కాస్త ఈ ఆహారాలను ఎంచుకోవడం మంచిది.

    చక్కెర పదార్థాలు: పంచదార ఎక్కువగా ఉన్న ఆహారాల జోలికి వెళ్లకపోవడం చాలా ఉత్తమం. వీటని తిన్నా కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. నార్మల్ గా కాదు ఇవి కీళ్ల సమస్యలను తీవ్రంగా ఎటాక్ చేస్తాయి. ఇది కాస్తా డయాబెటీస్‌కు దారి తీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారు స్వీట్లకు, పంచదారకు దూరంగా ఉండాలి.

    పిండి పదార్థాలు: అదే విధంగా పిండి పదార్థాలకు కూడా దూరం ఉండాల్సిందే. దీని వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. బియ్యం, గోధుమల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి అంటున్నారు నిపుణులు. ఇవి గ్లూటెన్‌ను రిలీజ్ చేస్తాయట. కాబట్టి వీటి వలన కీళ్ల సమస్యలు వస్తాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..