
కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న చోట లాక్ డౌన్ పెట్టుకుని వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టొద్దన్నారు. వివిధ దేశాల వైద్య నిపుణుల సహకారంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన వంతు సహకరిస్తామని తెలిపారు.