Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena Party : ఇడుపు కాయితం వర్సెస్ చిప్పకూడు.. కవిత జనసేన షాక్

Jana Sena Party : ఇడుపు కాయితం వర్సెస్ చిప్పకూడు.. కవిత జనసేన షాక్

Jana Sena Party  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు కల్వకుంట్ల కవిత. రోజురోజుకు ఆమె మాటలు శృతిమిస్తున్నాయి. దీంతో జన సైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతోంది. తన తండ్రి మాదిరిగా సెంటిమెంట్ ఆస్త్రాన్ని ప్రయోగించి తన తెలంగాణ రక్షణ సేన ఉనికిని బలంగా చాటుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆపై ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయనపై కామెంట్స్ చేస్తే రియాక్షన్ ఉంటుందని.. దాని ద్వారా రాజకీయం చేయవచ్చన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పై ఆమె వాడుతున్న భాష మాత్రం అభ్యంతరకరంగా ఉంది.

* ఆ సినిమాను పవన్ కు జతచేస్తూ..
ఇటీవల ఇడుపు కాయితం అనే సినిమా టైటిల్ వివాదంగా మారింది. తెలంగాణ వాడుక భాషలో విడాకుల కోసం తీసుకునే ధ్రువీకరణ పత్రం అన్న మాట. అయితే ఈ సినిమా టైటిల్ పై అనేక రకాల కామెంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. దీంతో చాలామంది ఈ ఇడుపు కాయితం అంటే ఏంటి అని ప్రశ్నించారు. ఒకవైపు ఆ వివాదం నడుస్తుండగా.. కల్వకుంట్ల కవిత స్పందించారు. దాని గురించి పవన్ కళ్యాణ్ ను అడగాలని సూచించారు. దీంతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ వ్యక్తిగత జీవితానికి ముడి పెడుతూ కల్వకుంట్ల కవిత కామెంట్స్ చేశారని అర్థం అవుతోంది. దీనిపై జనసైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చిప్పకూడు కవిత అనేదానికి అర్థం చెప్పాలి అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒక ట్వీట్ చేశారు. దీంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. జన సైనికులు సైతం ట్రోల్ చేస్తున్నారు.

* వ్యూహం ప్రకారమే..
అయితే కవిత ఒక వ్యూహం ప్రకారమే పవన్ కళ్యాణ్ పై ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. కచ్చితంగా కవిత కామెంట్స్ చేస్తే దానికి స్పందిస్తారు జనసైనికులు. గతంలో కెసిఆర్ సైతం ఇదే వ్యూహం అనుసరించేవారు. ఆయన చంద్రబాబును మధ్యకు లాగి సెంటిమెంటును రగిలించేవారు. ఇప్పుడు చంద్రబాబును కవిత టార్గెట్ చేసుకున్న పెద్దగా వర్కౌట్ కాదు. అందుకే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒక రకమైన సెంటిమెంట్ క్రియేట్ చేయాలని భావించడం.. స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె శృతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్థంపర్థం లేని మాటలు ఆడుతున్నారు. అయితే కేవలం తన పార్టీ ఉనికి కోసమే ఈ ప్రయత్నం అన్నది విశ్లేషకుల మాట. ఆమె ఊహిస్తున్నది, అంచనా వేసింది కొంతవరకు వర్క్ అయినట్టు కనిపిస్తోంది. ఏదో విడాకులు అని అర్థం వచ్చే సినిమా టైటిల్ ను.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేస్తూ సెటైరికల్ గా కవిత మాట్లాడడం చూస్తుంటే పక్కా వ్యూహం అని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version