Rakshita latest photos : మన చిన్నతనం లో చూస్తూ పెరిగిన కొంతమంది హీరోయిన్లు పెద్దయ్యాక ఇలా అయిపోయారు ఏంటి?, ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవారో అని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో హాట్ గా కనిపించిన హీరోయిన్లు చాలా మంది, ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా, చూస్తేనే భయపడే రేంజ్ లో తయారయ్యారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రక్షిత. ‘ఇడియట్’ చిత్రం తో ఈమె మన టాలీవుడ్ లోకి వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రక్షిత కి రాలేదు. వరుసగా శివమణి, పెళ్ళాం ఊరెళితే, నిజం, లక్ష్మి నరసింహా, ఆంధ్రా వాలా , అందరివాడు వంటి చిత్రాల్లో నటించి మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే , మరో పక్క కన్నడ సినిమాలు చేస్తూ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది రక్షిత.
అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న సమయం లోనే ఈమె కన్నడ డైరెక్టర్ ప్రేమ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమైనా తర్వాత కుటుంబానికే ఎక్కువ సమయాన్ని కేటాయించిన రక్షిత , కొన్నాళ్ళకు సోషల్ మీడియా లో గుర్తుపట్టలేని రేంజ్ లో లావు అయ్యింది. ఎంతో హాట్ గా కనిపించే రక్షిత సడన్ గా ఇలా ఎలా మారిపోయింది. అసలు నిజంగా అప్పట్లో మన కళ్ళతో చూసిన రక్షిత నేనా ఈమె ? అనే సందేహాలు కూడా వ్యక్తం చేసారు నెటిజెన్స్. ఆ రేంజ్ లో ఆశ్చర్యానికి గురి చేశాయి ఈమె లుక్స్. ఇప్పటికీ కూడా ఆమె ఏమి మారలేదు. అదే రేంజ్ లుక్ తో కొనసాగుతోంది. రీసెంట్ గానే ఈమె పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజెన్స్ ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు , కాస్త వర్కౌట్స్ చేయొచ్చు కదా అంటూ రక్షిత కి సలహాలు ఇస్తున్నారు. ఆమె అప్లోడ్ చేసిన లేటెస్ట్ ఫోటోలకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
