
వైరస్ ల, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాటి శాస్త్రీయ పేర్లతోనే ప్రస్తావిస్తున్నామని తెలిపింది. వీటికి ఒకే విధమైన పేరు ఉండడం కోసం అందరూ ఇదే పద్ధతిని అనుసరించాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ ఓ ఆగ్నేయాసియా విభాగం బుధవారం ఓ ట్వీట్ చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తెలిపింది. ఇండియన్ కోవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనిపించిందని డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.