
ఐసీఎస్ఈ, ఐఎస్ సీ 10, 12వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CBSCE) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొంది. విద్యార్థులు cisce.org లేదా results. cisce.org లో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఫలితాలు, వారికి వచ్చిన మార్కులను సంబంధించి విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ వారి పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.