Afghanistan: తాలిబాన్లు చంపినా ఆలయం వదలను.. తేల్చిచెప్పిన పూజారి

అఫ్గాన్ లోని ఓ హిందూ పురోహితుడు దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. అఫ్గాన్ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా తిరస్కరించారు. పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి కాబుల్ లోని రతన్ నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఈ మందిరాన్ని సంరక్షస్తూ వచ్చారని, అలాంటి గుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని అంటున్నారు. ఒక వేళ తాలిబన్లు తనను చంపేసినా.. దాన్ని సేవగా భావిస్తానని చెప్పారు. గుడికి వచ్చే చాలా మంది […]

Written By: Suresh, Updated On : August 18, 2021 9:21 am
Follow us on

అఫ్గాన్ లోని ఓ హిందూ పురోహితుడు దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. అఫ్గాన్ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా తిరస్కరించారు. పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి కాబుల్ లోని రతన్ నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తన పూర్వీకులు ఈ మందిరాన్ని సంరక్షస్తూ వచ్చారని, అలాంటి గుడిని ఇప్పుడు విడిచిపెట్టలేనని అంటున్నారు. ఒక వేళ తాలిబన్లు తనను చంపేసినా.. దాన్ని సేవగా భావిస్తానని చెప్పారు. గుడికి వచ్చే చాలా మంది హిందువులు, భక్తులు తమతో పాటు వచ్చేయాలని కోరినట్లు రాజేశ్ తెలిపారు. కానీ అందుకు తాను నిరాకరించానని వెల్లడించారు. అనేక మంది రాజేశ్ ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన చూసిస్తున్న విధేయత, దైవభక్తి పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.