
సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం జగన్ గురువారం మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోందన్నారు. మహానేత కోసం ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఓదార్పు యాత్రలో పరామర్శించా నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశాం. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశాం అని తెలిపారు.