Hurricane Hunters : కరీబియన్ దీవులను గడగడలాడిస్తున్న అత్యంత భయంకరమైన హరికేన్ ‘మెలిస్సా’ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. బీభత్సం సృష్టిస్తోన్న ఈ తుఫాన్ మధ్యలోకి ప్రయాణించడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. కానీ, US ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మాత్రం ఈ సాహసానికి సిద్ధపడ్డారు.
ఈ ‘హరికేన్ హంటర్స్’ బృందం ప్రత్యేక విమానంలో దూసుకెళ్లి మరీ తుఫాన్ మధ్యభాగంలో (Eye) ఉన్న అద్భుతమైన, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత దృశ్యాల ‘స్టేడియం ఎఫెక్ట్’
తుఫాన్ కేంద్రం (Eye of the Storm) వద్ద ప్రశాంత వాతావరణం ఉంటుంది. దానికి చుట్టూ మేఘాల గోడలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా భీకరంగా కనిపిస్తాయి. ఈ మేఘాల గోడలు ఒక పెద్ద స్టేడియంలాగా లేదా కొండలాగా కనపడతాయి. అందుకే దీన్ని ‘స్టేడియం ఎఫెక్ట్’గా హరికేన్ హంటర్స్ బృందం పేర్కొంది.
తుఫాన్ ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి, వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి యుఎస్ ఎయిర్‌ఫోర్స్ యొక్క 53వ వెదర్ రికనైసెన్స్ స్క్వాడ్రన్ సిబ్బంది ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. ఈ ఏడాది అత్యంత శక్తిమంతమైన తుఫాన్లలో ఒకటైన ‘మెలిస్సా’ కేంద్రంలో రికార్డు చేసిన ఈ వీడియోలు తుఫాన్ భయానక అందాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయి.
కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న అత్యంత భయంకరమైన హరికేన్(తుఫాన్) ‘మెలిస్సా’
ఈ క్రమంలో పెద్ద సాహసం చేసిన US ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది
విమానంలో వెళ్లి మేఘాల అద్భుత దృశ్యాలను చిత్రీకరించిన హరికేన్ హంటర్స్ బృందం
దీన్ని ‘స్టేడియం ఎఫెక్ట్’గా పేర్కొన్న బృందం pic.twitter.com/tNKWZZd0zu
— ChotaNews App (@ChotaNewsApp) October 28, 2025