New Year Hangover Cures : న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం తాగడం పరిపాటిగా మారిపోయింది. మసాలా వంటకాలను అతిగా తినడం కూడా అలవాటుగా అయిపోయింది. డిసెంబర్ 31 నాడు మద్యం తాగకపోతే.. బిర్యానీ తినకపోతే అది ఏదో ప్రపంచ విపత్తు లాగా చాలామంది భావిస్తున్నారు. వయసు తారతమ్యాలు లేకుండా.. తాగి, తిని ఎంజాయ్ చేస్తారు.
వాస్తవానికి మద్యం, మాంసం అనేవి విరుద్ధమైన కాంబినేషన్లు. మద్యం తాగి, మాంసం తినడం వల్ల శరీరం ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది.. కొంతమందిలో తలనొప్పి.. అజీర్తి.. ఇంకా రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ తలనొప్పి తగ్గడానికి కొంతమంది మద్యం తాగుతారు. అదే పనిగా తింటూ ఉంటారు. సమస్య తగ్గకపోగా.. మరింత పెరుగుతుంది. ఇలాంటివారు హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మద్యం తాగడం వల్ల, మాంసం తినడం వల్ల తలనొప్పి ఉంటుంది. కడుపులో వికారంగా ఉంటుంది. ఇటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువగా నీరు తాగాలి. శరీరంలో ఉండే డిహైడ్రేషన్ తగ్గించుకోవాలి. కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తాగాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభిస్తాయి. అల్లంతో తయారు చేసిన టీ ని తాగితే వికారం తగ్గుతుంది. అరటి పండ్లను తింటే నీరసం తగ్గిపోతుంది. తేలికపాటి ఆహారం తీసుకుంటే.. హ్యాంగ్ ఓవర్ పూర్తిగా తగ్గిపోతుంది. అలా కాకుండా హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి మద్యం తాగితే సమస్య ఇంకా పెరుగుతుంది.
సాధ్యమైనంతవరకు మద్యం తాగిన తర్వాత మాంసం తినకూడదని వైద్యులు చెబుతున్నారు. మద్యం తాగే అలవాటు ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. మాంసం కూడా పరిమితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇష్టానుసారంగా మాంసం తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. మాంసం అరగడానికి చాలా సమయం పడుతుందని.. శారీరక శ్రమ చేస్తే మాంసం త్వరగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు.