Horoscope Today: 2024 ఏప్రిల్ 16 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై పుష్య, అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇష్టమైన వారి కోసం బహుమతిని కొనుగోలు చేరస్తారు. కొన్ని రంగాల వారు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రంగాల వారు గొప్ప పనులు చేపడుతారు. రాజకీయ నాయకులు వాదనలు తక్కువ చేయాలి.
మిథునం:
కుటుంబంతో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత సమస్యలు తొలగిపోతాయి.
కర్కాటకం:
కొన్ని పనుల కోసం కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సంబంధాలు మెరుగుపడుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
సింహ:
వ్యాపారులు పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ రావొచ్చు. ప్రేమికులకు సవాళ్లు ఎదుర్కొంటారు. కొన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:
ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ పొందుతారు. జీవత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీకు కేటాయించిన బాధ్యతలు పూర్తి చేస్తారు.
తుల:
ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. సమాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాతంతో ముందుకు వెళ్తారు. కొన్ని కలలను నెరవేర్చుకుంటారు.
వృశ్చికం:
ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. డబ్బును సమానంగా పెట్టుబడులకు కేటాయించాలి. ప్రియమైన వారితో ఎక్కువ సమయం కేటాయిస్తారు.
ధనస్సు:
కొన్ని కలలను నెరవేర్చడానికి కష్టపడుతుంటారు. విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి అనువైన సమయం.
మకర:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేలా ప్లాన్ చేస్తారు.
కుంభం:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఓ సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది.
మీనం:
ఉద్యోగులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.