Horoscope Today: 2024 మార్చి31న ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో ఆదివారం మీన రాశివారు ఓ సమస్యపై ఆందోళనగా ఉంటారు. మరో రాశివారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ అవసరాలపై దృష్టి పెడుతారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కొందరు బయటి వ్యక్తులు మీపై వ్యతిరేకంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంపై నిర్లక్ష్యం చేయొద్దు..
మిథునం:
ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశాంతంగా ఉంటారు. మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చుల పెరుగుతాయి.
కర్కాటకం:
వ్యాపారానికి సంబంధించిన కొత్త ప్రణాళికలు చేపడుతారు. ఇతరులకు అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టమే. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
సింహ:
కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివాహ ప్రయత్నాలు సాగుతాయి. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు.
కన్య:
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా వాదనలకు దిగకుండా ఉండడమే మంచిది. ఉద్యోగులు కార్యాలయాల్లో కష్టపడి పనిచేస్తారు.
తుల:
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక అదృష్టం వరించనుంది. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం.
వృశ్చికం:
వివిధ రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. గతంలో ఉన్న సమస్యలపై ఉపశమనం పొందుతారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొత్త పట్టుబడుల విషయంలో పునరాలోచించాలి.
ధనస్సు:
ఓ ముఖ్యమైన పూర్తవుతుంది. దీంతో ఈ రాశివారు ఈరోజు సంతోషంగా ఉంటారు. వ్యాపార ప్రణాళికల గురించి శ్రద్ద పెడుతారు. ఆర్థిక లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలి.
మకర:
ఈ రాశివారికి ఈరోజు సమస్యలు ఎదుర్కొంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయడానికి శ్రద్ధ చూపాలి. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు.
కుంభం:
కుటంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆదాయం సమకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం:
ఓ సమస్యపై ఆందోళనగా ఉంటారు. ఇలాంటి సమయంలో పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోవద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.