Horoscope Today: 2024 ఏప్రిల్ 22 సోమవారం రోజున ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్య రాశిలో సంచరించనున్నాడు. దీంతో కుంభ రాశివారు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఉద్యోగులకు వ్యక్తిగత జీవితంలో కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభ రాశి:
కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో సరదాగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతారు.
మిథునం:
ఆర్థిక విషయాల్లో ప్రయోజనం ఉంటుంది. ఇష్టాను సారం ఖర్చులు చేస్తారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి.
కర్కాటకం:
ఉద్యగులు ఇబ్బందుల వాతావరణంలో ఉంటారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. వినోదం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
సింహ:
వ్యాపారులకు పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా మారుతాయి.
కన్య:
కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. లక్ష్యాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల సలహాలు పాటించడం మంచిదే. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి.
తుల:
ఈరోజు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. ఏ పనిచేసినా సక్సెస్ అవుతుంది. పెండింగు సమస్యలు తొలగిపోతాయి. స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయి.
వృశ్చికం:
కెరీర్ వృద్ధి కోసం కష్టపడుతారు. కొత్త ఆలోచనలు ఉత్సాహాన్ని ఇస్తాయి.ఫ్యామిలీ కోసం సమయం కేటాయించడం మంచిది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు:
ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు. రిస్క్ ఉండే పనుల జోలికి వెళ్లొద్దు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. చాలా విషయాల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి.
మకర:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. కొత్త దనం కోసం ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
కుంభం:
వీరు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. సమయం వృథా చేయకుండా లక్ష్యాల కోసం కష్టపడాలి. ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఇతరులతో సరదాగా ఉంటారు.
మీనం:
వ్యక్తిగత పనులపై దృష్టి పెడుతారు. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. కొన్ని విషయాల్లో అనుకోని విజయం ఉంటుంది. వీరికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.