Horoscope Today: 2024 మార్చి 28న ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా కుంభ రాశివారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక అదృష్టం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేరస్తారు. జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.
వృషభ రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగతంగా శక్తివంతులవుతారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
మిథునం:
ఉద్యోగులకు కార్యాలయాల్లో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.
కర్కాటకం:
ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఈ కారణంగా కొత్త పెట్టుబడులు పెడుతారు.ఇతరుల నుంచి సులువుగా సాయాన్ని పొందుతారు.
సింహ:
కొన్ని కీలక పనులు పూర్తవుతాయి. కొన్ని కార్యకలాపాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. సంబంధాల్లో చీలిక ఉండొచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కన్య:
దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. స్నేహితుల్లో ఒకరి నుంచి బహుమతిని అందుకుంటారు. పాత తప్పులపై గుణపాఠం నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల:
కుటుంబ జీవితం ఆహ్లదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. అనుకున్న పనులు నేరవేరుస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చికం:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. పాత స్నేహితులను కలుస్తారు. కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళనతో ఉంటారు. ఆస్తికి సంబంధించిన విషయంలో విజయం సాధిస్తారు.
ధనస్సు:
ఈ రాశివారు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఉద్యోగులు కార్యాలయలో ప్రశాంతంగా ఉంటారు. కారణం లేకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
మకర:
కొందరు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి శ్రమిస్తారు.
కుంభం:
కొన్ని విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఓ నిర్ణయం కలవరపెడుతుంది.
మీనం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగితే నేటితో పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు.