Horoscope Today: 2024 మార్చి30న ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శనిదేవుడి అనుగ్రహంతో కొన్న రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రయోజనాలు ఉండనున్నాయి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వీటి కోసం తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకుంటారు.
వృషభ రాశి:
ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల వాగ్దానాలపై దృష్టి పెడుతారు. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు.
మిథునం:
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. సీనియర్ల సలహాలు పాటిస్తారు. వైవాహిక జీవిత సమస్యల నుంచి బయటపడుతారు.
కర్కాటకం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏదైనా పని చేస్తున్నట్లే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహ:
జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతంది. కష్టపడి పనిచేసే వారు సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి.
కన్య:
వివిధ మార్గాల నుంచి ఆదాయం పెరుగుతంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం దిశగా ఆలోచించాలి.
తుల:
ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామి తో ప్రేమగా ఉంటారు. పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.
వృశ్చికం:
ఈ రాశివారు ఇతరులకు ఎక్కువ సాయం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు ప్రశాంతగా ఉంటారు.
ధనస్సు:
ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర:
ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. మీ ప్రవర్తన వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగొచ్చు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
కుంభం:
ఈ రాశివారు ఈరోజు ఒంటరిగా గడుపుతారు. కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని పనులు సమస్యలను తీసుకొస్తుంది.
మీనం:
ఖరదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆందోళన కారణంగా వ్యాపారులు నిరాశతో ఉంటారు.