Horoscope Today: 2024 ఏప్రిల్ 2న ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో వృషభ రాశివారు పాత పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మరికొందరు నిరాశతో ఉంటారు. మంగళవారం 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు తమ బాధ్యతలను నెరవేరుస్తారు. సమయాన్ని వృథా చేస్తారు. ఈ కారణంగా కొన్ని పనులు నిలిచిపోయి నిరాశతో ఉంటారు.
వృషభ రాశి:
పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు.
మిథునం:
కొన్ని విషయాల్లో ఉల్లాసంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో వాదనలు ఉండొచ్చు. పాత పొరపాట్లకు చింతించాల్సి ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటకం:
గతంలో ఉన్న సమస్యలు నేటితో తొలిగిపోయే అవకాశం ఎక్కువ. కొన్ని పనులను బాధ్యతతో పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే దానిని తిరిగి పొందుతారు.
సింహ:
కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త వారిని చేర్చుకోవద్దు.
కన్య:
వాదనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. బయటి వ్యక్తుల ద్వారా ప్రేరణ పొందుతారు. ఓ విషయంలో ఆందోళనగా ఉంటారు.
తుల:
కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రు విషయంలో కేర్ గా ఉండాలి. వ్యాపారులు బిజీ వాతావరణంలో ఉంటారు.
వృశ్చికం:
అనవసర విషయాలపై ఎక్కువగా ఆలోచించవద్దు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతిని అందజేస్తారు.
ధనస్సు:
కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
మకర:
అదనపు పని కారణంగా ఒత్తిడితో ఉంటారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని పనులు ఈజీగా చేయగలుగుతారు. చాలా కాలం తరువాత పాత స్నేహితుడిని కలుస్తారు.
కుంభం:
గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వివిధ మార్గాల నుంచి అధిక ఆదాయం పొందుతారు. రుణ సాయం ద్వారా కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇవి లాభదాయకంగా ఉంటాయి.
మీనం:
వివిధ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్ పొందుతారు. శత్రువలు పట్ల జాగ్రత్తగా ఉండాలి.