Honda City Elevate: ఇండియన్ కార్ల మార్కెట్లో హోండా సిటీ తనకంటూ ప్రత్యేకత చాటుకుంది. ఈ కంపెనీ కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. గత ఏడాది ఎలివేట్ SUVని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం 6 నెలల్లో 30 వేలకు పైగా ఉత్పత్తులను విక్రయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ కారుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023 లో రిలీజ్ అయిన ఈ మోడల్ నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఈ కారు వివరాల్లోకి వెళితే..
2023 హోండా సిటీ ఎస్ యూవీ 1.5 లీటర్ 4 సిలిండర్ నేచురల్ అస్పిరేటెడ్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ మోడల్ 119 బీహెచ్ పీ పవర్ తో పాటు 145 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ CVTఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ తో కలిగి ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకీ గ్రాండ్ విటారాకు హోండా మిడ్ సైజ్ ఎస్ యూ వీ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారును ఇండియాలోనే కాకుండా జపాన్ లోనూ విక్రయించేందుకు సిద్ధమైంది.
హోండా సిటీ ఎలివేట్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్లే వంటి వాటికి సపోర్టు చేస్తుంది.అలాగే ఎల్ ఈడీ హెడ్ లైట్స్, డీఆర్ఎల్ తోపాటు డ్యూయెల్ డిస్ ప్లే డ్యాష్ బోర్డు ఉంటుంది. 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ తో పాటు అధునాతన సేప్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే అమ్మకాల్లో లక్ష్యానికి చేరువగా ఉన్న ఈ మోడల్ త్వరలో మరిన్ని విక్రయాలు చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
హోండా సిటీ ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్ యూవీ ధర 11.58 లక్షల ప్రారంభ ధర ఉంది. ఇది SV, V, VX , ZX అనే వేరయంట్లలో లభ్యమవుతోంది. దేశీయ కార్ల మార్కెట్లో ప్రత్యేకత చాటుకుంటున్న ఈ కంపెనీ వినియోగదారులను ఆకర్షించేలా ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు ఇస్తుంటుంది. ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేకుండా అమ్మకాల్లో వృద్ధి సాధించడంతో ఈ కారుపై ఆసక్తి చూపుతున్నారు.