
దళిత బంధును నిలిపివేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. లిస్ట్ ప్రకారమే విచారిస్తామని జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంపై హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఈ వాజ్యాలు వేశాయి.