https://oktelugu.com/

Meenakshi Chaudhary : అక్కినేని కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టబోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న ఈ అందాల రాశి సుశాంత్ హీరో గా నటించిన 'ఇచట వాహనములు నిలుపరాదు' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా విడుదలైంది అనే విషయం కూడా జనాలకు తెలియదు, అయినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వరుసగా క్యూలు కట్టాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 02:53 PM IST

    Meenakshi Chaudhary

    Follow us on

    Meenakshi Chaudhary : ప్రస్తుతం సౌత్ ఇండియా లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇప్పటి వరకు ఈమె అనేక సినిమాల్లో నటించినా, బాగా గుర్తించుకోదగ్గ పాత్ర ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న ఈ అందాల రాశి సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా విడుదలైంది అనే విషయం కూడా జనాలకు తెలియదు, అయినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వరుసగా క్యూలు కట్టాయి. రెండవ సినిమానే రవితేజ లాంటి స్టార్ తో ‘ఖిలాడీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిల్చింది కానీ అదే ఏడాది ఈమె నుండి విడుదలైన ‘హిట్ : ది సెకండ్ కేస్’ పెద్ద హిట్ అయ్యింది.

    ఇక ఆ తర్వాత మీనాక్షి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది ప్రారంభం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ద్వారా ఆడియన్స్ ని పలకరించిన మీనాక్షి కి, ఇదే ఏడాది లో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఇంకా పెద్ద హిట్ అయ్యింది. సినిమాలు సూపర్ హిట్స్ అయితే అవుతున్నాయి కానీ, ఆమెకి శ్రీ లీల తరహా గుర్తింపు మాత్రం రావడం లేదు. ఈ నెల 14 వ తారీఖున వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘మట్కా’ చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్. ట్రైలర్ చూస్తే మరో హిట్ ఈమె ఖాతాలో పడేటట్టు ఉంది. కనీసం ఈ సినిమాతో అయినా ఆమెకి రావాల్సిన గుర్తింపు వస్తుందో లేదో చూద్దాము.

    ఇదంతా పక్కన పెడితే ఈమె గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలో ఈ హాట్ బ్యూటీ అక్కినేని కుటుంబం లో కోడలిగా అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో ఈమె చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ‘ఇచట వాహనములు నిలపరాదు’ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారని, అప్పటి నుండి వీళ్లిద్దరి రిలేషన్ కొనసాగుతూనే ఉందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో ఒక రూమర్ తిరుగుతుంది. వచ్చే నెలలో నాగ చైతన్య, శోభిత పెళ్లి జరగబోతున్న ఈ నేపథ్యంలో, ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ రూమర్ కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.