Heroine
Heroine : సోషల్ మీడియా యుగంలో ఏదైనా సాధ్యమే. ఒక్క రాత్రిలో సామాన్యులు సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. కుంభమేళాలో పూసలమ్మే పేద అమ్మాయి మోనాలిసాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. నేషనల్ మీడియాలో ఆమె పేరు కొన్నాళ్ళు మారుమోగింది. మోనాలిసా హిందీలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా ఒక స్టార్ దర్శకుడు కంట్లో పడి హీరోయిన్ ఆఫర్ పట్టేసిన అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్. చీరకట్టులో ముగ్ద మనోహరమైన ఆమె రూపం కట్టి పడేసింది. ఈ అమ్మాయి ఎవరో నాకు చెప్పండి. హీరోయిన్ ఆఫర్ ఇస్తాను అని దర్శకుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు.
ఆ దర్శకుడు ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ. కేరళకు చెందిన శ్రీలక్ష్మి సతీష్ అనే అమ్మాయి మెడలో కెమెరాతో ప్రకృతి ఫోటోలు బంధిస్తూ రీల్స్ చేసేది. ఆమెలోని ప్రత్యేకతను గుర్తించిన వర్మ హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీలక్ష్మి సతీష్ పేరును ఆరాధ్య దేవిగా మార్చేశాడు. చెప్పినట్లే ఆమెతో శారీ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. శారీ మూవీ ఫిబ్రవరి 28న థియేటర్స్ లోకి రానుంది. ఇక శారీ మూవీ ప్రోమోలు, సాంగ్స్ లలో ఆరాధ్య దేవి సూపర్ గ్లామరస్ గా ఉంది.
20 ఏళ్ల ప్రాయంలో గ్లామర్ రోల్స్ చేయకూడదని ఆరాధ్య దేవి అనుకుందట. కానీ ఇప్పుడు ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దమే అంటుంది. అయితే ఒకప్పుడు దేశం మెచ్చిన సినిమాలు చేసిన వర్మకు ఫేమ్ లేదు. ఆయన సినిమాలను పట్టించుకునే ఆడియన్స్ లేరు. మరి వర్మ సినిమా ఏ మేరకు ఆరాధ్య దేవి కెరీర్ కి ఉపయోగపడుతుందో చూడాలి.
శారీ మూవీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఆరాధ్య దేవి, సత్య యాదు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గిరి కృష్ణ కమల్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాత. ఒక అమ్మాయిని శారీలో చూసి ఆమె అందానికి పిచ్చోడైన యువకుడి కథే శారీ మూవీ అని తెలుస్తుంది. ఆరాధ్య దేవి మొదటి చిత్రం శారీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి..
Web Title: Heroine girl who blocked the directors mind in the saree
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com