Hari Hara Veeramallu vs OG Movie : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, రీసెంట్ గానే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన సంగతి అందరికి తెలిసిందే. సెప్టెంబర్ నెలాఖరున ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మొదలు పెట్టిన ఆయన, ఈ నెలాఖరుతో షూటింగ్ ని పూర్తి చేయబోతున్నాడు. ఇప్పటికే 90 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ లొకేషన్స్ లోకి అడుగుపెట్టిన రోజే ఈ విడుదల తేదీని ప్రకటించాడు నిర్మాత ఏఏం రత్నం. ఇది కాసేపు పక్కన పెడితే ‘హరి హర వీరమల్లు’ సినిమా కంటే ముందు ‘ఓజీ’ చిత్రం ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.
మార్చి 27 వ తారీఖున విడుదల చేసేందుకు నిర్మాత దీవీవీ దానయ్య ప్రయత్నాలు చేస్తున్నాడట. ఎందుకంటే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినప్పటికీ, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి నిర్మాత దానయ్య పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా భేటీ అయ్యి, ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని వెనక్కి జరిపి, ఓజీ చిత్రాన్ని ముందుగా విడుదల చేసుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరబోతున్నాడట. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ‘హరి హర వీరమల్లు’ కంటే ఎక్కువగా ‘ఓజీ’ చిత్రం మీదనే అంచనాలు భారీ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఓజీ చిత్రం ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ కి తగ్గట్టుగా తీస్తున్న సినిమా. దానికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో మరియు పోస్టర్స్ కి ఫ్యాన్స్ నుండి మాత్రమే కాకుండా, ఆడియన్స్ నుండి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఓజీ చిత్రాన్ని ముందుగా విడుదల చేయలేని అభిమానుల నుండి ఒత్తిడి ఎదురు అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే ‘హరి హర వీరమల్లు’ కంటే ముందుగా ‘ఓజీ’ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. కేవలం కోస్తాంధ్ర రైట్స్ 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అదే విధంగా నైజాం హక్కులు 50 కోట్ల రూపాయలకు, కర్ణాటక హక్కులు 16 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రాంత హక్కులు ఏకంగా 28 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయే అవకాశం ఉందట. బిజినెస్ ఈ రేంజ్ లో జరుగుతుంది కాబట్టి, ముందుగా ఓజీ చిత్రాన్ని విడుదల చేయాలని బయ్యర్స్ కూడా కోరుతున్నారట, మరి ఈ రెండిట్లో ఏది ముందు విడుదల అవ్వబోతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.