
పశ్చిమ, నైరుతి దిశల నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా బలమైన గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర తీరప్రాంతంలో 40-50 కోలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్య్సకారులు గురువారం సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. బుధవారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జట్లులు పడ్డాయి. రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.