
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. బ్యారేజీలోకి ప్రస్తుతం 61,311 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లను 2 అడుగుల మేర, మరో 60 గేట్లను ఓ అడుగు మేర ఎత్తి 59,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.