నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఉచ్చు బిగుస్తోంది. ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోర్న్ వీడియోల రాకెట్ లో ప్రధాన భూమిక పోషించిన ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాట్ హిట్, హాట్ షాట్ అనే యాప్స్ ద్వారా పోర్న్ గ్రాఫిక్స్ అప్ లోడ్ చేస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మోడల్ గెహ్నా వశిష్ట్ రాజ్ కుంద్రాపై సంచలన విషయాలు వెల్లడించారు.
రాజ్ కుంద్రా ఓ కొత్త యాప్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. హిందీ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో కొద్ది రోజుల ముందు రాజ్ కుంద్రాను కలిసినట్లు చెప్పారు. బాలీ ఫేమ్ అనే యాప్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పినట్లు చెప్పారు. బాలీ ఫేమ్ యాప్ ద్వారా రియాల్టీ షోలు, మ్యూజిక్ షోలు, చాట్ షోలు, సినిమాలు,వీడియోలు తీసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు.
ఆయన మరదలు షమితాశెట్టి సాయి తమ్ హంకర్, మరో ఇద్దరు ఆర్టిస్టులను తీసుకున్నారు. ఓ కథతో షమితాతో ఓ సినిమా తీయాలనుకున్నాడు. దానికి దర్శకత్వం వహించమని అడిగారు. తరువాత తాను షమితా శెట్టిని కలవలేదు. పారితోషికం గురించి కూడా అడగలేదు. గెహ్నా వశిష్ట్ మిస్ ఏషియా బికినీ విన్నర్ గా అందరికి తెలిసిందే. పోర్న్ రాకెట్ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ముంబై క్రైం విభాగానికి చెందిన ప్రాపర్టీ విభాగం ససేమిరా అంది. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్ ద్వారా గెహ్నా పాపులార్టీ తెచ్చుకున్నారు.
తరువాత ఈ కేసులో ఇరుక్కోవడంతో ఆమెపై ప్రచారం సాగుతోంది. రాజ్ కుంద్రా దాదాపు 70 వీడియోలు ప్రొడ్యూస్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీడియోలు రూపొందించిన సంస్థలకు సమన్లు జారీ చేసి అక్కడి ఉద్యోగులను విచారిస్తున్నారు. జులై 23 నాటికి పోలీస్ రిమాండ్ ముగియడంతో రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. జులై 27 వరకు పోలీస్ రిమాండ్ కు తరలిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.