
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. దీంతో జూరాల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. జూరాలకు 3.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 4.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం 316.607 మీటర్ల నీటిమట్టం ఉంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.20 టీఎంసీలుగా ఉంది.